శీల సౌందర్యం
అవి 1955-1957 నెల్లూరు లోని వి.ఆర్. కళాశాలలో ఇంటర్ చదివే రోజులు , యం .యస్.రాఘవన్
తర్కశాస్త్ర(లాజిక్) ఉపన్యాసకులు వారు మంచి పొడగరి, సొగసరి.చక్కని గోధుమరంగు
వర్ణంతో ప్రకశిస్తుండేవారు. నుదుటిన తిరుచుర్ణంతో ధవళవస్త్రాలతో, తలపాగతో,
అపరసరస్వతీ స్వరూపునిలా చేత పుస్తకం ధరించి తరగతి లోకి వస్తున్న వారిని చూస్తుంటే
ఒక రకమైన గౌరవభావం, దానితో కూడిన భయం అందరి లో చోటు చేసుకునేది. వారు రచించిన తర్కశాస్త్ర౦(లాజిక్)
పుస్తకమే మాకు పాఠగ్రంధంగా ఉండేది .
హాజరు పుస్తకం లోగల విద్యార్థులు పేర్లు వరసక్రమాని అనుసరించి మమ్ములను బెంచికి
ముగ్గురు చొప్పున కుఉర్చోనబెట్టేవారు.స్థలమార్పిడి జరగరాదు.ఎవరైనా రాకపోతే ఆ
విద్యార్థి స్తలం ఖాళీగా ఉండాల్సిందే.విద్యార్థులు వరుసున బట్టి వారు హాజరు
వేసేవారు.అంతేకాని పిలిచేవారు కాదు.కాని మా 70 మంది విధ్యార్థుల పేర్లు ఆయనికి
బాగా తెలుసు.మా తరగతి గదిలో బోధిస్తున్నప్పుడు మా ప్రక్కన తరగతిలో ఆచార్యులు
రాకపోతే ఆ తరగతి కూడా మా తరగతి లాగే నిశ్శబ్దంగా ఉండేది.ఎందుకంటే ఒక సాధారణ
ఆచార్యుడిని శీల సౌందర్యం పట్ల విధ్యార్థుల ఆరాధనా భావం అట్టిది.నేను కళాశాల విడేటప్పుడు
వారు ఇచ్చిన ఆటోగ్రాఫ్”They are Slaves ,Who Dare not be in the Right with Two or
Three”వారు తరచూ
గుర్తుచేసే ఈ కవితలోని పంక్తుల అర్ధం ఏమంటే సన్మార్గంలో నడిచే ఎ
ఇద్దరిముగ్గురితోనో చేతులు కలపలేని వారు బానిసలే అని ఈనాటికి వారి మాటల ప్రభావం
ఇప్పటికి నాపై ఏంటో ఉంది.
Article in Ananya Spandana Magazine
No comments:
Post a Comment